ఫిలింనగర్-2 నిర్మిస్తా.. : కేసీఆర్

హైదరాబాద్ ను అద్భుత సినీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.ఇక నుంచి సినీ పరిశ్రమ సమస్యలపైనే తాను దృష్టి పెట్టబోతున్నానని ఆయన తెలిపారు.  జయసుధ తనయుడు శ్రేయాన్ కథనాయకుడిగా నటించిన ‘బస్తీ’ సినిమా ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా  హాజరైన కేసీఆర్ పాటల సీడీని, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

దేశంలోనే ఎక్కువగా సినిమాలు నిర్మాణం అయ్యేది హైదరాబాద్ లోనే.. రామోజీ ఫిలింసీటీలో అధి సాధ్యమవుతోందని అమితాబ్ తన తో అన్నారని .. తాను దీనికి చాలా గర్వపడ్డానన్నారు. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమను మరింతగా అభివృద్ది చేస్తాన్నారు. ఫిలింనగర్ 2 నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం త్వరలోనే సినిమా పరిశ్రమ పెద్దలతో మీటింగ్ పెట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *