ఫిబ్రవరి 15 న ఇండియా- పాకిస్థాన్ వాల్డ్ కప్ మ్యాచ్

-ఇండియా పాక్ మ్యాచ్ కోసం 100 కోట్ల మంది వెయిటింగ్!

దాయాదుల పోరు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇండియా-పాకిస్థాన్ టీంలు తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్ తీరే వేరు. రెండు టీంలు కలిసి మ్యాచ్ లు ఆడుతున్నాయంటే ఆ ‘కిక్కే’ మూమూలుగా ఉండదు. ఇక వాల్డ్ కప్ లో రెండు టీంలు తలపడుతున్నాయంటే…టీవీలకు అతుక్కుపోక తప్పని పరిస్థితి. ఈ రెండు దేశాలకు చెందిన ఫ్యాన్స్ కాకుండా మిగతా దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కూడా మ్యాచ్ చూస్తుంటారు. వచ్చే ఫిబ్రవరి 15 న ఇండియా- పాకిస్థాన్ టీంలు వాల్డ్ కప్ మ్యాచ్ లలో ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ను వాల్డ్ వైడ్ గా వంద కోట్ల మంది టీవీల్లో చూస్తారంట. ఇది క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ నే ఎక్కువ మంది చూస్తారంట. 2011లో జరిగిన వాల్డ్ కప్ లో రెండు టీంల మధ్య జరిగిన మ్యాచ్ ను 98 కోట్ల మంది చూశారు. పాత రికార్డ్ ను ఈ కొత్త రికార్డ్ బ్రేక్ చేయనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్ కోసం టికెట్లన్నీ బుక్ అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.