ఫిబ్రవరి మొదటి వారంలో సి.కళ్యాణ్ కొత్త చిత్రం ‘పిశాచి’

‘చంద్రకళ’వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్ తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘పిశాచి’చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్న విషయం తెలిసిందే. మిస్కిన్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి’చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్త్ర్రె. లిమిటెడ్. కల్పన చిత్ర కాంబినేషన్ లో సి.కళ్యాణ్, కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘మిస్కిన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘పిశాచి’చిత్రం ఇటీవల విడుదలై అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. మనసుల్ని దోచుకునే దెయ్యం కధతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ధ్రిల్ చేస్తుంది. రొమాంటిక్ హర్రర్ గా రూపొందిన ‘పిశాచి’తెలుగులోను పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుందన్నారు. ఇటీవల మా బేనర్ లో విడుదల చేసిన ‘చంద్రకళ’సూపర్ హిట్ అయింది. దాన్ని మించి ‘పిశాచి’ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాము’’అన్నారు. బాల సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్త్ర్రె. లిమిటెడ్, కల్పన చిత్ర బేనర్స్ లో విడుదల కానున్న ‘పిశాచి’చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్, రాధారవి, హరీష్ ఉత్తమన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి రాయ్, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్, ఎడిటింగ్: గోపీనాధ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కో- ప్రొడ్యూసర్: సి.విరావు, నిర్మాతలు: సి.కళ్యాణ్, కోనేరు కల్పన, దర్శకత్వం: మిస్కిన్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.