
హైదరాబాద్, ప్రతినిధి : హరిత హారంపై ఫ్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీనికోసం సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ నగర శివార్లలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీకి వెళ్లి సమీక్షించారు. అడవుల అభివృద్ధి, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ హరితహారం పధకంతో పాటు అటవీ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అటవీ శాఖ సిబ్బంది రూపొందించిన లోగోనూ సీఎం లాంచ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితాహారంపై ఫుల్లుగా ఫోకస్ చేయడంతో పాటు…ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా ప్రకటించింది. దీంతో పారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా ఈ పథకానికి సంబంధించిన ప్లాన్ రెడీ చేశారు. మూడేళ్లలో దాదాపు 230 కోట్ల మొక్కలను నాటాలని డిసైడైంది. ఇప్పటికే పై నుంచి కిందిస్థాయి వరకు అటవీ సిబ్బందితో పాటు ఇతర అనుబంధ శాఖల యంత్రాంగం కూడా కదిలింది. అడవుల స్మగ్లింగ్ కు చెక్ పెట్టాలనుకుంటున్నారు అధికారులు. అందుకోసం ఆయుధాలను ఇవ్వాలని సీఎం ను కోరనున్నారు. దీంతో పాటు సిబ్బంది కొరతను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకురానున్నారు. 3 వేల మందిని రిక్రూట్ చేయాలని కోరనున్నారు. కేరళ తరహా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.