Breaking News

ఫామ్ హౌస్ పై చూపిన శ్రద్ధ ముస్లింల సంక్షేమంపై చూపటంలేదు: మాగంటి

ఫామ్ హౌస్ పై చూపిన శ్రద్ధ ముస్లింల సంక్షేమంపై చూపటంలేదు: మాగంటి

ముస్లింల సంక్షేమం పట్ల తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమై 15రోజులు గడిచిన తరువాత గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ రంజాన్ కోసం ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించడమే నిదర్శనమని మాగంటి గోపీనాధ్ వ్యాఖ్యానించారు. ఫామ్ హౌన్ లో కూర్చొని కుట్ర రాజకీయాలపై, తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి శ్రద్దచూపారు కానీ, ముస్లింల సంక్షేమం గురించి మాత్రం ఆలోచించే తీరిక వారికి లేదన్నారు. రంజాన్ మాసం ప్రారంభం కంటే నెల రోజుల ముందే ముస్లిం సోదరులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద రోడ్డు వేయించడం, మసీదులకు మరమ్మత్తులు నిర్వహించడం, నిరంతరయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు నెలల ముందే నిధులు మంజూరు చేసి రంజాన్ ప్రారంభం కంటే ముందే పూర్తి చేసేవి. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా రంజాన్ ప్రారంభం అయిన 15రోజుల తరువాత నిధులు ఇస్తామని, దేశంలో ఏ రాష్ట్ర్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ లో ముస్లిం సోదరులకు వరాలు ఇస్తున్నామని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు నిధులు కేటాయించి ఎప్పుడు పనులు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఇంత తక్కువ సమయంలో ఆ
నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తారన్నారు. ఇంత తక్కువ సమయంలో చేసే పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి కమిషన్ వచ్చే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు ఆఘమేఘాల మీద నిధులు కేటాయిస్తున్నారు కానీ, మసీదుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. రెండు నెలల క్రితం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఇస్తామన్న రూ.200 కోట్లలో నేటికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. ఇప్పుడు ఇస్తామన్న నిధులు ఎప్పటికిస్తారో? రంజాన్ పండుగ రోజును పురస్కరించుకుని రేషన్ షాపుల్లో అదనపు చక్కెర కోటాతో పాటు ప్రత్యేకమైన సరుకులు ఇవ్వటం ఆనవాయితీ. గత ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బంగారు తెలంగాణ పేరుతో తమ సొంత కుటుంబాన్ని బంగారంగా మార్చుకుంటున్నారు కానీ, ముస్లింల సంక్షేమం పట్టించుకోకపోవడం హేమనీయమన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *