
మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేసి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.. మల్లన్న సాగర్ నిర్వాసితులను ఒప్పించేందుకు రెఫరెండం నిర్వహించాలని 70శాతం మంది ఒప్పుకుంటేనే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
మెదక్ జిల్లా ఏటిగడ్డ క్రిష్ణాపూర్ లో దీక్ష ప్రారంభించిన రేవంత్ రెడ్డి 15రోజుల్లోగా వారి డిమాండ్లు తీర్చాలని లేదంటూ ఫాంహౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాగా ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీక్షలో కేసీఆర్ పై అనుచితం ప్రవర్తించారంటూ మన్నె గోవర్దన్ రెడ్డి అనే టీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్ పై 504,290,188,21/76 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.