
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగు రోజులుగా ఫాంహౌస్ లో ఉంటూ ఖరీఫ్ వ్యవసాయ పనులు, విత్తనాలు నాటడాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన పనులు పూర్తికావడంతో హైదరాబాద్ బాట పట్టారు. ఇన్నాళ్లు ఫాంహౌస్ లోనే అధికారులు, నాయకులతో సమావేశమై నిర్ణయాలను తీసుకున్నారు.