ఫలించిన హరీష్ రావు కృషి – పెసర్లు కొనుగోలుకు కేంద్రం అంగీకారం

పెసర్లు కొనుగోలుకు కేంద్రం అంగీకారం

నాఫేడ్ యం. డి. తో మాట్లాడిన మంత్రి హరీష్

రంగం లోకి దిగిన నాఫేడ్.

సోమవారం నుంచి పెసర్లు కొనుగోలు

25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయం.

మద్దతు ధర 5575 కన్నా తక్కువకు అమ్మవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి .

తెలంగాణా లో పెసర్లు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రెండు రోజుల క్రితం డిల్లీ లో తెలంగాణా మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్ రావు కేంద్ర  వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ తో జరిపిన చర్చలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫేడ్  తరపున తెలంగాణ మార్క్ ఫెడ్ సంస్థ సోమవారం నుంచి  పెసర్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనున్నది.  కేంద్ర మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం డైరెక్టర్ శశి భూషణ్, నాఫేడ్ యం. డి. సంజీవ్ కుమార్ లతో మంత్రి హరీష్ రావు శుక్రవారం సాయంత్రం ఫోన్ లో మట్లాడారు. పేసర్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోరారు.  పెసర్లు క్వింటాలుకు 5575 రూపాయలను మద్దతు ధర గా నిర్ణయించినట్టు మంత్రి హరీష్ రావు కు  కేంద్ర మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం డైరెక్టర్  శశిభూషణ్ తెలియజేశారు. ఈ నేపథ్యం లో సచివాలయం లో తన చాంబర్ లో మంత్రి హరీష్ రావు మార్కెటింగ్, వ్యవసాయ శాఖా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని  ఈ సమావేశం లో నిర్ణయించినారు. పెసర్లు ఎక్కువగా పండే ప్రాంతాలను గుర్తించి అక్కడ కొనుగోలు కేంద్రాలను నాఫేడ్ ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం పేసర్లకు మద్దతు ధర ప్రకటించినందున రైతులు తొందర పడి తక్కువ రేటుకు అమ్ముకోరాదని మంత్రి హరీష్ రావు కోరారు. e-nam లో కుడా తక్కువ రేటు పలికితే రైతులు దాన్ని తిరస్కరించవచ్చని ఆయన చెప్పారు. ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్ మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయి, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *