
ఈ మధ్య ఏ పేపర్ లో చూసిన కొత్త సినిమాల ప్రారంభోత్సవాలకు పేరున్న దర్శకులు, హీరోలను తెగ వాడేస్తున్నారు. ఏమంటే ఆయన ఫ్యాన్స్ మేమూ అంటూ కొత్తవి, పాతవి అన్న తేడా లేకుండా వాడేస్తున్నారు.
మొన్నటికి మొన్న చిరంజీవి, పవన్, మహేశ్ బర్త్ డేలకు అందరూ హీరోలు, దర్శకులు , నిర్మాతలు తమ సినిమాకు ప్రమోషన్ వస్తుందని తెలుగు పత్రికల్లో తెగ హ్యాపీ బర్త్ డే ప్రకటనలు ఇచ్చారు. నిజానికి సదురు హీరోలకు బర్త్ డే చేప్పే కన్నా తమ సినిమా ప్రమోషన్ కే అది ఎక్కువ ఉపయోగపడింది..
కాగా ఇటీవల దాసరి నారాయణ రావు ఆశీస్సులతో అంటూ ఆంద్రజ్యోతి ఓ సినిమా ప్రారంభోత్సవం అంటూ ప్రకటన వచ్చింది.. కాగా దీనిపై దాసరి ఫైర్ అయ్యారు. నాకు, ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికోసం ఆయన పత్రికలకు ఓ ప్రకటన కూడా ఇవ్వడం గమనార్హం..