ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీయం కేసీఆర్‌ను క‌లిసిన మంత్రి జూప‌ల్లి

గట్టు ఎత్తిపోతలకు సీయం గ్రీన్‌సిగ్న‌ల్‌

గ‌ద్వాల‌లో ఈద్గా నిర్మాణం కోసం రూ.2.25 కోట్ల నిధుల మంజూరుకు సీయం హామీ

గ‌ద్వాలకు బీసీ స్డడీ స‌ర్కిల్ మంజూరు

సీయం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసిన మంత్రి జూప‌ల్లి, గ‌ద్వాల

నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌-గ‌ట్టు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని త్వ‌ర‌లో ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీయం కేసీఆర్ ఆదేశించారు.  పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి  గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి బుధవారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీయం కేసీఆర్‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టాల్సిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. గ‌ట్టు ఎత్తి పోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డంతో పాటు…గ‌ద్వాల ప‌ట్ట‌ణంలో ఈద్గా నిర్మాణం కోసం 2.25కోట్ల రూపాయల‌ను మంజూరు చేయాల‌ని కృష్ణమోహ‌న్‌రెడ్డి కోర‌గా…సీయం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గద్వాల్ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిగా అప్ గ్రెడ్ చేయడంతో పాటు ఆసుపత్రి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. అలాగే వ్య‌వసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరీ, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం, ప్రాసెసింగ్ మ‌రియు ప్యాకేజింగ్ యూనిట్‌ మంజూరీ చేయాల‌ని కోర‌గా సీయం సానుకూలంగా స్పందించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయ‌డంతో పాటు…నియోజ‌క‌వ‌ర్గానికి అద‌నంగా 15 వంద‌ల డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను మంజూరు చేసేందుకు సీయం సానుకూల‌త వ్య‌క్తం చేసిన‌ట్లు కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో బీసీ స్ట‌డీ స‌ర్కిల్, మండ‌లానికో ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల మంజూరీకి సీయం సానుకూలంగా స్పందించిన‌ట్లు కృష్ణమోహ‌న్‌రెడ్డి తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో మ‌త్స్యకారుల, గొల్లకురుమల, ఎస్సీ , మున్నూరు కాపు సంక్షేమ భవనాల నిర్మాణం కోసం యాబై ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేయాల‌ని సీయం కేసీఆర్‌ను కోరారు. గుర్రం గడ్డ బ్రిడ్జి తో పాటు…గద్వాల నియోజకవర్గంలో 40 బీసీ, ఎస్సీ కమ్యూనిటీ భ‌వ‌నాల‌ను నిర్మాణం చేయాల‌ని కోర‌గా..సీయం సానుకూలంగా స్పందించిన‌ట్లు కృష్ణ‌మోహ‌న్ రెడ్డి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *