Breaking News

ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ – 2018 ఆవిష్కరణ

ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ - 2018 ఆవిష్కరణ

గౌరవ మంత్రివర్యులు శ్రీ. టి. పద్మారావు గౌడ్ గారు తన చాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ – 2018 ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ డైరీ ని నాల్గవ సారి నా చేతులమీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుందన్నారు.    ఎక్సైజ్ శాఖ లో వున్న అన్నీ యూనియన్లు ఒకే తాటి పై వుండాలని అన్నారు.  అదేవిదంగా తెలంగాణ ఉద్యమ సమయం లో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమం లో పాల్గొన్నారు.  వారందరికి నా కృతజ్ఞతలు.  తెలంగాణ ఆవిర్భవించిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గుడుంబా పై ఉక్కుపాదం మోపి, గుడుంబా నుండి బాధితులను కాపాడుకోవడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రము గుడుంబా రహిత రాష్ట్రము గా ఉండటం కోసం నిరంతరంగా శ్రమ పడుతున్నా  కానిస్టేబుల్ నుండి డీసీ వరకు అందరికి నా ధన్యవాదములు.. ఎక్సైజ్ సిబ్బంది కి ప్రభుత్వ వాహనాలు అందించడం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కి తీస్కెల్లడం జరిగిందని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీస్కుంటారన్నారు.

ఈ కార్యక్రమం లో టి‌ఎస్‌బి‌సి‌ఎల్ ఛైర్మన్ దేవి ప్రసాద్ రావు, ప్రిన్సిపాల్ సెక్రెటరీ సోమేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్ రావు, జాయింట్ కమిషనర్ రావు, మంత్రి ఓ‌ఎస్‌డి రాజేశ్వర్ రావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ వివేకానంద రెడ్డి, జనరల్ సెక్రెటరీ హరికిషన్, ట్రెజరర్ గణేశ్ గౌడ్, గౌరవాధ్యక్షులు ఖురేషీ, గౌరవ జనరల్ సెక్రెటరీ జీవన్ సింగ్, అసోసియేషన్ ప్రెసిడెంట్లు వెంకటేష్ నేత, శీలం శ్రీనివాస రావు, జి‌. అంజన్ రావు మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *