
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమంలో ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం సేవలు తెలంగాణ రాష్ర్టానికి మరియు తెలంగాణ భవిష్యత్తు ఉపయోగపడాలని ఎల్ రమణ ఆకాంక్షించారు. అందుకు ప్రొఫెసర్ కోదండరాం స్పందిస్తూ తాను ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ తెలంగాణ సమాజ అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నాయకులు ఎం ఎస్ శ్రీనివాస రావు, మేకల సారంగపాణి, వల్లరపు శ్రీనివాస్, గండికోట విజయ్ తదితరులు పాల్గొన్నారు.