
తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ పార్క్‌లో జరిగిన అసోసియేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్‌కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ని తీర్చిదిద్దుతున్నాం, పేద ప్రజలకు వైద్యం అందించడం కనీస బాధ్యత ప్రభుత్వాలది వైద్య రంగంలో ఎవరి పాత్ర వాళ్ళదే ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ అవసరం పోటీ ఉన్నప్పుడే మంచి నాణ్యమైన వైద్యం కూడా ప్రజలకు అందుతుందని, అలాగని కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ వల్లో లేక ప్రైవేట్ హాస్పిటల్స్ వల్లో ప్రజలకు పూర్తి స్థాయి వైద్యం అందించలేం ప్రైవేట్ హాస్పిటల్స్ అనవసర చికిత్సల పేరుతో డబ్బులు గుంజుతున్నరన్న అపోహ నెలకొన్నది అలాంటి అపోహలు తొలగించుకోవాల్సిన అవసరం ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వైద్యాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా, సేవగా గుర్తించాలి ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులే కాదు, సమస్యలేవైనా సరే పరిష్కరిస్తాం నయా పైసా ఖర్చు లేకుండా అవినీతి లేకుండా అనుమతులివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కొత్త రాష్ట్రం…దేశంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పలు పథకాలు అమలు అవుతున్నాయి 40వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి వేలాది కోట్ల అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయి అనేక ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉంటాయి. అందుకే ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీం బిల్లుల విషయమై ప్రైవేట్ హాస్పిటల్స్ సహకరించాలి ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించేందుకు సహకరించాలి
ఈ కార్యక్రమంలో డిఎంఇ రమేశ్‌రెడ్డి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవిందర్‌రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగిరెడ్డి, డాక్టర్ ఎల్.సురేశ్, డాక్టర్ వై.రవిందర్‌రావు, సురేందర్‌రావు, కృష్ణప్రసాద్, నర్సింగారెడ్డి, డాక్టర్ సలూజా, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.