ప్రేవేటు’ స్కూళ్లకు సర్కారు దాసోహం

తెలంగాణ విద్యావ్యవస్థల్ని రూపుమాపాలన్న మంత్రి కడియం శ్రీహరి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. మంత్రి కడియం విద్యాలో సంస్కరణల్ని అమలు చేయాలని నిర్ణయించి ఒంటిపూట బడులను రద్దు చేశారు. మార్చికే తరగతులు, పరీక్షల్ని పూర్తి చేసి ఏప్రిల్ వరకు కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని నిర్నయించారు. అంతేకాదు ఇక నుంచి ప్రైవేటు పాఠశాలల్లో సైతం ప్రభుత్వ పుస్తకాలనే పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిన ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు పుస్తకాల ముద్రణ వ్యాపారులు ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు.

ఉపాధ్యాయులను ముందుపెట్టి నాటకం మొదలుపెట్టారు. వారితో సమ్మెకు పురికొల్పారు. పుస్తకాలు అందుబాటులో లేకుండా చేశారు. ఇది అమలు చేయడానికి నానా ఆటంకాలు సృష్టించారు. దీంతో మంత్రి కడియం ఆశలు నెరవేరలేదు.. ఆయన సంస్కరణల్ని వాయిదావేసి మళ్లీ ఒంటిపూట బడులు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *