
హైదరాబాద్ : ప్రేమ వ్యవహారంలో ఒక టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తెలుగు సీరియళ్లు చంద్రముఖి, అరుంధతి, అంతపురం, శిఖరం అనే సీరియల్స్ ల నెగెటివ్ పాత్రల్లో నటించిన హర్జీత్ కౌర్(28) అలియాస్ రూప ఆదివారం ఉదయం హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పెట్రోలింగ్ పోలీసులు నటిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. సాగర్ పోలీసులు రూపను బహీరాబాద్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నటి రూప ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణం. ఆమె కొంతకాలంగా కేవల్ సింగ్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కేవల్ సింగ్ కుటుంబ సభ్యులు నటిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం నటి రూపకు కేవల్ స్పష్టం చేశాడు. మనస్తాపం చెందిన నటి రూప ఆదివారం ఉదయం హుస్సేన్ సాగర్ లో దూకడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ప్రేమికులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
కాగా