ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య

హైదరాబాద్ :ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను తీసింది. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లో ఈ దారుణం జరిగింది. ఓ యువతి తల్లిదండ్రులు రాజు అనే యువకుడిని కొట్టి చంపారు. ప్రశాంత్ నగర్ లో నివాసముండే యువతి, యువకుడు రాజు ఓ ఫర్నిచర్ షాపులో కలిసి పనిచేస్తున్నారు. ప్రేమించాలంటూ యువతిని పదే పదే వెంటపడిన రాజు ఆమె వినపకపోవడంతో ఈ ఉదయం కొడవలితో యువతి ఇంటికి వెళ్లి బెదిరించాడు. తమ కూతురుపై దాడికి యత్నించగా ఘర్షణలో యువతి తల్లిదండ్రులు ఆ యువకుడిని కొట్టి చంపేశారు. అతడు తీసుకొచ్చిన కొడవలితోనే ఆ యువకుడిని పొడిచేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *