‘ప్రేమంటే సులువు కాదురా’ షూటింగ్ పూర్తి!!

‘ప్రేమంటే సులువు కాదురా.. అది నీవు గెలవలేవురా’అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుష్కరకాలం క్రితమే తన ఫ్యాన్స్ అందరికీ హితబోధ చేయడం తెలిసిందే! ఇప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ కూడా అదే మాటంటున్నాడు. ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించబోతున్నారు.

‘ఆర్.పి ప్రొడక్షన్స్’పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ‘ప్రేమంటే సులువు కాదురా’షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రాజీవ్ సరసన సిమ్మిదాస్ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యన్.శ్రీరాములు-కె.సుధాకర్ రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చందా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రేమలో పడడం, లేదా పడేలా చేయడం సులువే, కానీ దానిని కాపాడుకోవడమే చాలా కష్టం’అనే పాయింట్ తో.. వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న చిత్రం‘ప్రేమంటే సులువు కాదురా’.ఆటో నడుపుకునే అబ్బాయి- ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి మధ్య ఏర్పడ్డ ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారి తీసిందనేది క్లుప్తంగా కథ. రాజీవ్-సిమ్మిదాస్ ల పెర్ ఫార్మెన్స్, సురేష్ రఘట సినిమాటోగ్రఫీ, నందన్ రాజ్ మ్యూజిక్, కృష్ణచిన్ని సాహిత్యం, ఉద్ధవ్ ఎడిటింగ్ లతో పాటు కధ, కధనం, సంబాషణలు ‘ప్రేమంటే సులువు కాదురా’చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఏఫ్రిల్ మొదటివారంలో ఆడియోను, అదే నెల చివరి వారంలో వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నాం’అన్నారు. కాశీ విశ్వనాధ్, మధుమణి, అశోక్ కుమార్, జబర్ధస్త్ చంటి, చమ్మక్ చంద్ర, చిట్టిబాబు, టార్జాన్, ఖలీల్ భాషా, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గోవింద్ రెడ్డి-సుమన్, సంగీతం: నందన్ రాజ్, సాహిత్యం: కృష్ణచిన్ని, కూర్పు: ఉద్ధవ్, ఛాయాగ్రహణం: సురేష్ రఘట, సహనిర్మాతలు: యన్.శ్రీరాములు-కె.సుధాకర్ రెడ్డి, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కధ-స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: చందా గోవింద్ రెడ్డి!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *