ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర

డెహ్రాడూన్ : గత ఏడాది వచ్చిన వరదల నుంచి తేరుకున్న భక్తులు.. మళ్లీ చార్ ధామ్ యాత్ర కోసం వడివడి గా బయలు దేరుతున్నారు.  మంగళవారం నుంచి ఈ చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఆరు నెలల శీతాకాల విరామమనంతరం  గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు ఫునప్రారంభమయ్యాయి.  గంగోత్రి దేవాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు, యమునోత్రి దేవాలయాన్ని 11.30 గంటలకు తెరిచి  దేవతా మూర్తులను వేద మంత్రాలతో పురోహితులు పూజలు చేశారు.

కాగా చార్ ధామ్ యాత్రలో అత్యంత ఎత్తైన మంచుతో కప్పబడి ఉన్న కేదర్ నాథ్, బదిరినాథ్  పుణ్యక్షేత్రాలను ఏప్రిల్ 24, 26 తేదీల్లో తెరువనున్నట్టు పూజారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *