ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” కల – కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో నెరవేరింది: మంత్రి హరీష్ రావు

ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” స్వప్నం.
కాళేశ్వరం పూర్తి కావడమే ఆయనకు నివాళి.
మంత్రి హరీష్ రావు.

ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు” కాకా” వెంకట స్వామీ చలవేనని రాష్ట్ర ఇరిగేషన్,మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో దివంగత జి.వెంకటస్వామి మూడవ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.అయితే అప్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి
కెసిఆర్ నీళ్ళు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైను చేశారని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కా బోతోందని ’కాకా’ కు అదే నిజమైన నివాళి అని మంత్రి అభిప్రాయపడ్డారు. గత పాలకులు నీళ్లను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉరుకున్నారని, కా కా మాత్రం వై. ఎస్.ని ధిక్కరించారని చెప్పారు. కాకా వెంకట స్వామి కలను త్వరలోనే సాకారం చేయబోతున్నట్టు చెప్పారు. కాకా అన్ని పదవులు అధిష్టించారని అయినా అహంభావం లేకుండా సామాన్య ప్రజలు, కార్మికుల తోనే ఆయన నిరాడంబరంగా తిరిగారన్నారు.శక్తి వంతమైన కార్పొరేట్ లాబీయింగ్ ను తట్టుకొని కార్మికులకు పెన్షన్ పథకం అమలు జరిగేలా పోరాడారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కాకా కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కాకా ను అత్యున్నతంగా గౌరవించుకోవాలని ట్యాంక్ బండ్ పై కాక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తు చేశారు. ఆయన స్మారకంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్రభుత్వంచేపడుతుందని హరీష్ రావు చెప్పారు.విద్యార్థులుసోషల్ మీడియాకు, వాట్స్ అప్ కు స్వస్తి చెప్పి పుస్తకాల వైపు దృష్టి మరలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని
అభిప్రాయపడ్డారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధన కోసం 2001 లో ఉద్యమించిన సమయం లో  చాలా మంది హేళన చేశారని  కానీ పట్టుదలగా 14ఏళ్లపాటు శ్రమించి తెలంగాణ సాధించారని హరీశ్ రావు గుర్తు చేశారు.వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ లా కాలే జ్ఆల్ఇండియాలో 25వ స్థానం లో ఉండటం గర్వ కారణం అని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కాకా కుటుంబ సభ్యులకు  క్రమశిక్షణ, సంస్కారం నేర్పారని చెప్పారు. నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దారని పొగిడారు.ఈ రోజు కాకా మన మధ్య లేకపోవడం తీరని లోటు అన్నారు.తెలంగాణ ఉద్యమం లో ఎం.పి.గా డాక్టర్ వివేక్ తెరవెనుక ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం చాలా మందికి తెలియదని హరీశ్ రావు తెలిపారు.

కీలక సందర్భాల్లో కాకా కుమారులు వివేక్, వినోద్ చక్రం తిప్పినట్టు హరీశ్ రావు తెలిపారు.ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రాంతానికి కాకా మేలు చేశారని చెప్పారు. బతికుండగా తెలంగాణ రాష్ట్రాన్ని సంధించాలనేది కాకా కోరిక అని , ఆ కోరిక నెరవేరాకే తుది శ్వాస విడిచారన్నారు.కాకా చాలా అదృష్టవంతుడని తెలిపారు.2004 లో కాంగ్రెస్ తో పొత్తులో  కాకా కీలక పాత్ర వహించారని మంత్రి చెప్పారు.జనం మధ్య, జన నేతగా పేదల పక్షపాతిగా మెలిగిన వ్యక్తి కాకా అని అన్నారు. కాకా కృషి కారణంగా సింగరేణి కాలరీస్ తెలంగాణకు దక్కిందన్నారు.80 వేల మంది నిరు పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన వ్యక్తిగా, నాయకునిగా కాకా చిరస్మరణీయుడని హరీశ్ రావు తెలిపారు.2002 నుంచి 2014 వరకు కాకా
తో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. వెంకట స్వామి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారన్నారు.

తెలంగాణ కోసం బులెట్ దెబ్బలు తిన్న వ్యక్తి కాకా అని హరీష్ కొనియాడారు. కెసిఆర్ పోరాట పటిమ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.కెసిఆర్ పట్టుదలతో తెలంగాణ సాధించారని,విద్యార్థులు కూడా పట్టుదలతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ఫేస్ బుక్ , వాట్స్ అప్ లను వదిలిపెదితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు మంత్రి హితవు పలికారు.ఇప్పుడు తల దించుకొని ఫేస్ బుక్, వాట్స్ అప్ లలో మునిగిపోతే తరువాత తల దించుకోక  తప్పదని ఆయన  అన్నారు. ఉన్నతమైన టార్గెట్లు పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థానాల్లోకి రావాలని కోరారు. తెలంగాణ సమాజం వెంకటస్వామికి ఎంతో రుణపడి ఉందని తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం లో మొట్టమొదటి సంక్షేమ హాస్టల్ ప్రారంభించారని ఆయన తెలిపారు. తాను ఆరవ తరగతి చదివే రోజుల్లో రాష్ట్రపతి, ప్రధాని కంటే కూడా “ కాకా’ వల్లనే ఎక్కువ మేలు జరిగిందన్నారు.

వెంకటస్వామి లాగా హరీష్ రావు అత్యంత ఎక్కువ ప్రజా సంబంధాలను కలిగి ఉన్న నాయకుడని చక్రపాణి అన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా ‘ కాకా “ను సంప్రదించి పరిష్కరించుకునే వాళ్ళమని తెలిపారు.తనకు ఈ కళాశాలకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పారు.తమ బంధువులెందరో ఈ కాలేజి లో విద్యనభ్యసించారని చెప్పారు. సమాజం మేలు కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వెంకటస్వామి ఎంతో ముందుచూపుతో ఈ కళాశాలను స్థాపించారని ఘంటా చక్రపాణి కొనియాడారు.5 సంవత్సరాల్లో లక్ష కు పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు టి.ఎస్.పి.ఎస్,సి. చైర్మన్ ప్రకటించారు.ఇప్పటికే 30వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నామని, 2500 మంది సివిల్ ఇరిగేషన్ విభాగం లో ఇంజనీర్లను నియమించామని ఆయన తెలిపారు.ఎవరికీ ఎలాంటి అపోహలు, సందేహాలు, భయాలు అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగ నియామకాల పట్ల కట్టుబడి ఉన్నారని , ఆయన చిత్తశుద్ధిని శంకించరాదని  చక్రపాణి అన్నారు.రాష్ట్ర పారిశ్రామిక విధానం తో మరిన్ని ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు.

తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఎస్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ క్రేజ్, చరిష్మా ఉన్న నాయకుడు హరీష్ రావు అని పొగిడారు.సుప్రసిద్ధ కార్మిక నాయకుడు వెంకటస్వామిఅని అన్నారు.ఈ కళాశాల పూర్వ అధ్యాపకునిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు.12ఏళ్ల పాటు ఇక్కడ సేవలందించానని తెలిపారు.ఎక్కడ ఉద్యమం,పోరాటం ఉంటె అక్కడ హరీష్ రావు ఉంటారని తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎం.పి డాక్టర్ వివేక్ చెప్పారు..ఎంతటి సమస్య అయినా హరీష్ రావు వెనుకడుగు వేయరని
అన్నారు. హరీష్ శక్తి సామర్థ్యాలకు నిదర్శనం రికార్డు వ్యవధిలో పూర్తి కావస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అని వివేక్ చెప్పారు. బాగ్ లింగంపల్లి లోని అంబెడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జరిగిన దివంగత కేంద్ర మంత్రి వెంకటస్వామి తృతీయ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

kaka     kaka 1     kaka 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *