ప్రాణం తీసిన చిల్లర

ప్రాణం తీసిన చిల్లర

హైదరాబాద్: వనస్థపిపురంలో దారుణం జరిగింది. నాలుగు రూపాయల చిల్లర ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చింది. చిల్లర కోసం షాపు యజమానితో జరిగిన ఘర్షణ లో రాజేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. రాజేశ్ సిగరెట్ తీసుకుని చిల్లర ఇవ్వలేదని షాపు యజమానితో గొడవపడ్డాడు. దీంతో ఆ షాపు యజమాని తన స్నేహితులతో కలిసి రాజేశ్‌ను చితక బాదారు. ఐదుగురు వ్యక్తులు ఓకేసారి దాడి చేయడంతో రాజేశ్ భయంతో పరుగులు పెట్టాడు. రాజేశ్ పరుగులు పెడుతూ ప్రధాన రహదారిపైకి రావడంతో అటుగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగు రూపాయల చిల్లర కోసం ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య గొడ‌వ రాజుకొని ఒక‌రి మృతికి కార‌ణ‌మైంది. వనస్థలిపురంలోని వర్డ్‌ అండ్‌ డీడ్ పాఠ‌శాల‌ సమీపంలోని పాన్‌షాపు వ‌ద్‌ కు వ‌చ్చిన‌ రాజేష్‌ అనే వ్యక్తి అక్‌ డ‌ సిగరెట్ కొన్నాడు. రాజేష్‌ పాన్ షాపు న‌డుపుతున్న వ్య‌క్తికి నాలుగు రూపాయల చిల్ల‌ర‌ తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వారిద్దరి మ‌ధ్య వివాదం చెల‌రేగడంతో, షాపు యాజమాని, అతని స్నేహితులు కలిసి రాజేష్‌పై దాడిచేశారు. అయితే రాజేష్‌ని వారు చితక్కొడుతుండ‌డంతో ఆ దెబ్బలు తాళలేక రాజేష్‌ రోడ్డుమీదకు పరుగుతీశాడు. రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో రాజేష్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన‌ ఐదుగురిని అరెస్టు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ దృశ్యమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *