ప్రాజెక్టుల భూ సేకరణకు ప్రజలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

ప్రాజెక్టుల భూ సేకరణకు ప్రజలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల భూ సేకరణకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టర్ మిడ్ మానేర్, ఎల్లంపల్లి, గౌరిపల్లి ప్రాజెక్టుల కాల్వల నిర్మాణానికి భూ సేకరణకు సంబంధించి బెజ్జంకి మండలంలోని వడ్లూరు, ఖాసీంపేట, గన్నవరం, హుస్నాబాద్ మండలంలోని రేగొండ, భీందేవరపల్లి మండలంలోని
వంగర, మానకొండూర్ మండలంలోని గంగిపల్లి, అన్నారం ముంపు గ్రామాల భూ నిర్వాసితులతో భూ విలువలపై సంధి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణ పోను మిగులు భూములు రైతులు అమ్మవద్దని, ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశ్యామలమై భూమి విలువ పెరుగుతుందని, నీటి సౌకర్యంతో ఆధునిక వ్యవసాయ
పద్దతులతో మంచి లాభాలున్న కూరగాయలు, వాణిజ్య పంటలు పండించి, మంచి దిగుబడులతో అధిక లాభాలు పొందవచ్చని, భూములు రూపు రేఖలు మారుతాయని అన్నారు. కాల్వలపై ప్రతి మూడు కిలోమీటర్లకు రవాణకు వంతెనలు నిర్మిస్తామని కలెక్టర్ అన్నారు. భూములలో వున్న బావులు, పైప్ లైనులు, చెట్లకు అదనంగా పరిహరం చెల్లిస్తామని
అన్నారు. భూములు కోల్పోతున్న కొంత మంది రైతులపై సానుభూతి వుందని, వారి త్యాగంతోనే లక్షల ఎకరాలు సస్యశ్యామలమై ఎందరో రైతులు అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలంలోని వడ్లూరు, ఖాసీందేవిపేట, గన్నవరం గ్రామాల్లో సేకరిస్తున్న భూమికి జాతీయ రహదారికి దగ్గర్లో  వున్న దానికి ఎకరాకు 7 లక్షలు, మిగతా భూమికి ఎకరాకు రూ. 6.80 లక్షలు, హుస్నాబాద్ మంDSC_5577డలంలోని రేగొండ గ్రామంలో భూమికి ఎకరాకు రూ. 4.75 లక్షల ధరను కలెక్టర్ నిర్ణయించారు.

 

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ పౌసుమి బసు, భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్వర్లు, కరీంనగర్, సిరిసిల్ల, మంధని ఆర్డీవోలు చంద్రశేఖర్, బిక్షా నాయక్, శ్రీనివాస్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్లు, ఇంజనీరింగ్, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, భూసేరణ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *