
కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర్ర స్దాయి ప్రాజెక్టు పర్యవేక్షణ సంఘ సమావేశంలో భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర్రంలోని అన్ని జిల్లాల్లో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందులు అధిగమించాలని అటవీభూమి తదితర సమస్యలుంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. వీలయినంత త్వరలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ల్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసినట్లు, పరిహరం చెల్లింపు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో భూసేకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో అదనపు సంయుక్త కలెక్టర్ డా.ఎ.నాగేంద్ర, డివిజనల్ ఫారెస్ట్ అధికారులు సి.పి వినోద్ కుమార్, రవికిరణ్, జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.