
సీఎం కేసీఆర్ నిన్న జరిగిన కేబినెట్ భేటిలో కీలక నిర్ణయం తీసుకున్నారు.. 2018లోపు గోదావరి, కృష్ణలపై ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దారించుకున్నారు. ఇందుకోసం 80వేల కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు (ప్రపంచ బ్యాంకు తదితర వాటి నుంచి అప్పు) నిర్ణయించారు. ముఖ్యంగా గోదావరి ఉపనదుల నీటిని ప్రాణహిత, ఇంద్రావతిలపై ఆనకట్టలు కట్టాలని నిర్ణయించారు.
ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీందించి ఓట్లు అడగాలని నిర్ణయించారు. 2019లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ 2018లోపు పూర్తి చేయాలని నిర్ణయించారట.. అంతేకాదు. చిన్న కాల్వలు, చెక్ డ్యాంలు, మినీ డ్యాంల కోసం నెలకు 1000 కోట్ల చొప్పున నీటిపారుదల శాఖకు కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదంతా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అప్పటికీ ప్రాజెక్టులు పూర్తయ్యి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్బవిస్తుందని.. మంచి శకునంగా వానలు పడితే ఇక తెలంగాణలో కరువు, నీటి కరువు ఉండనే ఉండదు.. దీంతో మళ్లీ కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయం.. అందుకోసమే ఈ ప్లాన్లన్నీ..