ప్రసంగంలో దంచి కొట్టిన రాహుల్

న్యూఢిల్లీ : రెండు నెలల సెలవు తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన రాహుల్ లో మార్పు స్పష్టంగానే కనిపిస్తోంది. మొన్న కిసన్ ర్యాలీలో రైతులతో మమేకం.. నిన్న పార్లమెంటులో ప్రసంగంతో రాహుల్ అదరగొట్టారు. బీజేపీ, ప్రధాని మోడీ తీరును ఎండగట్టారు. పదునైన విమర్శలతో అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.

రైతుల పక్షాన నిలబడడం బీజేపీకి చేతకాదని.. ఇది పారిశ్రామిక వేత్తల ప్రభుత్వం అని విమర్శించారు. ఇది అచ్చెదిన్ ప్రభుత్వం కాదని.. సూటు బూటు ప్రభుత్వం అంటూ మోడీ తీరును ఎండగట్టారు.  పారిశ్రామిక వేత్తల పంచన చేరడం మాని 67 శాతం దేశంలో ఉన్న రైతుల పక్షాన ప్రధాని నిలవాలని ధ్వజమెత్తారు. లెక్కలు గణాంకాలతో సహా ఆయన రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు.

కాగా రాహుల్ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ తిప్పికొట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్, వెంకయ్య కాంగ్రెస్ పై మండిపడ్డారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనే రైతుల దుస్థితికి కారణమని వారికి మాట్లాడే అర్హత లేదన్నారు.

కాగా పార్లమెంటు ముగిసిన అనంతరం సోనియా విలేకరులతో మాట్లాడారు. రాహుల్ ప్రసంగం బాగుందని చాలా మంది ప్రశంసించారని ముసిముసిగా నవ్వుతూ సోనియా కొడుకుపై ప్రే కనబరిచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *