Breaking News

ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కే. లక్ష్మన్ కన్నుమూత

R_K_LAXMAN_02

ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కే. లక్ష్మన్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. పూణేలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. లక్ష్మన్ పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మన్. 1921 అక్టోబర్ 21న మైసూర్ లో పుట్టిన ఈయన రాజకీయ కార్టున్లు వేయడంలో దిట్ట. దాదాపు 50 ఏళ్ల పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో పనిచేశారు. ‘కామన్ మ్యాన్’ అనే పాత్రతో లక్ష్మన్ వేసిన కార్టున్లు చాలా ఫేమస్ అయ్యాయి. దేశంలోని అందరు రాజకీయ నాయకుల కార్టున్లు ఆయన వేశారు. ఆయన అద్భుత ప్రతిభకు ‘రామన్ మెగెసెసె’ అవార్డును 1984లో అందుకున్నారు. లక్ష్మన్ చేసిన సేవలకు 2005లో పద్మ విభూషన్ అవార్డుతో కేంద్రం సత్కరించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *