ప్రమాద నివారణే మార్గం

ప్రమాద నివారణే మార్గం

రోజురోజుకు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుండడంతో…. నివారణ పై ప్రత్యేక దృష్టి సారించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడం, కారు నడిపేవారు సీటు బెల్ట్‌ ధరించడం తప్పనిసరి అంటూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయ్‌. అగస్టు 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉత్తర్వుతో రోడ్డు ప్రమాదా నివారణపై ప్రమాదా నివారణపై అవగాహన కార్యక్రమాలకు నడుం బిగించారు పోలీసులు. హెల్మెట్లు, సీట్‌ బెల్ట్‌ ధరించడంతో పాటు…. ట్రాఫిక్‌ నిబంధను పాటించాలంటూ… కర్నూలు జిల్లా వ్యాప్తంగా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాహనదారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వీటిపై కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఇందులో జిల్లా రెవెన్యూ, ఆర్టీఓ, పోలీస్‌ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయ్‌. ఆగస్టు మొదటి వారం రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న పోలీసులు…. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే… జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రమాదాల నివారణపై అధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ప్రజలు. హెల్మెట్ల వినియోగం, ట్రాఫిక్‌ రూల్స్ పాటించడంపై ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *