ప్రమాదం దురదృష్టకరం: హరీష్ రావు

కాళేశ్వరం ప్యాకేజి ప్రమాద ఘటన చాఅలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు రూ. 20లక్షల పరిహరం చెల్లించేందుకు ఏజన్సీ ముందుకు వచ్చిందని, ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో బుధవారం జరిగిన ప్రమాద ఘటనా స్ధలాన్ని గురువారం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్, ఇంజనీరింగ్ అధికారులతో సందర్శించారు. సొరంగ మార్గంలోకి వెళ్ళి పరిశీలించారు. మృతుల ఫోటోలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం వల్ల విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం వల్ల జరిగిందన్నారు. సొరంగ మార్గంలో 2,3 టన్నుల బండరాళ్లు పడకుండా రాజ్ బోల్డులు బిగించడం జరుగుతుందని చెప్పారు. భోజన సమయంలో కార్మికులంతా బయటికి వస్తున్న క్రమంలో రాజ్ బోల్టులతో సహ బండరాళ్ళు పడిపోవడం వల్ల చనిపోయినట్లు తెలిపారు.
ఇది నిజంగా చాలా దురదృష్టకరమని, ఊహించని పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి బ్లాస్టిక్ పనులు నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై హైదరాబాద్ లో అత్యున్నత స్ధాయి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషీ, ఈఎంసీ మురళీధర్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి హైలెవల్ సమావేశం నిర్వహించి దర్యాప్తునకు కమిటీని వేసినట్లు
చెప్పారు. పదిహేను రోజుల్లో పూర్తి నివేధికలు ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు. జుయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డు డైరెక్టర్ జనరల్ ఎం రాజు, సీనియర్ జుయాలజిస్టు రవీంధ్రనాధ్, ఈఎంసీ అనిల్, నాగేందర్లతో కలిసి కమిటీ వేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పున:రావృతం కాకుండా సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోతుగా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కమిటీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా పనిచేసి సీనియర్ ఎం రాజు అనుభవం ఉన్న వ్యక్తి, బెంగుళూరులో ఉన్నారని, ఆయనతో ఫోన్ లో మాట్లాడి బాధ్యతలు తీసుకొని నివేదికలు ఇవ్వాలని కోరగా అందుకు ఆయన  అంగీకరించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల కళల ప్రాజెక్టు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఏడుగురు మృతి చెందిన సంఘటన చాలా బాధాకరమన్నారు. ఆకుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన వారిలో ఒకరు వరంగల్ జిల్లా నుంచి, మిగిలిన వారంతా ఇతర రాష్ట్ర్రాలకు చెందిన వారన్నారు. మృతులు ఏరాష్ట్ర్రం వారైనా సరే వారంతా మాకార్మికులేనన్నారు. వారందరికి ఇన్సూరెన్సూ కూడా ఉందని, దాంతో పాటు ప్రభుత్వ పక్షంగా, ఏజన్సీ పరంగా ఆదుకుంటాం, పూర్తి స్ధాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగే టన్నేల్ లో క్షుణ్ణంగా పరిశీలించి ఇంజనీరింగ్ అధికారుల ద్వారా నివేధికలు
తెప్పించుకుని సంఘటనలు పున:రావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆయన వెంట కలెక్టర్, ఎస్పీ, ఇంజనీరింగ్ అధికారులున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *