Breaking News

‘ప్రమాణ స్వీకారంతో ఇరుకున పెడుతున్న కేజ్రీ’

venkaiah

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో ఓడించి.. తమనే ప్రమాణ స్వీకారానికి రమ్మనడంపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు షాక్ అయ్యారు. బుధవారం ఉదయం తనను కలుసుకోవడానికి వచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్ కు వెంకయ్య పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆప్ విజయాన్ని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పుకొచ్చారు. అనంతరం తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా కేజ్రీవాల్ చేసిన ఆహ్వానాన్ని వెంకయ్య సున్నితంగా తిర్కసించారట.. ఈనెల 14 న తాను పశ్చిమ బెంగాల్ లో పట్టణాభివృద్ధిపై జరుగనున్న సమావేశానికి వెళ్లాల్సి ఉందని అందువల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేనని నిర్మొహమాటంగా స్పష్టం చేశారట వెంకయ్య..

కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పై నిన్న సానుకూలంగా స్పందించిన బీజేపీ నేతలు ఈ రోజు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ ఫలితాలు తమ బీజేపీకి పెద్ద దెబ్బే అని వెంకయ్య నాయుడు సహా నేతలంతా బుధవారం మీడియాతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు ఇది రెఫరెండం మాత్రం కాదని వారు స్పష్టం చేశారు. ఓటమికి కారణాలు అన్వేషించుకుంటామని సెలవిచ్చారు.

కాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా ఢిల్లీ పెద్దలను ఇరుకున పెట్టేందుకు చూడడంపై బీజేపీ నేతలు లోలోపల మథనపడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీనే ఓడించి ఇఫ్పుడు బీజేపీ నేతలైన ప్రధాని మోడీ, కిరన్ బేడి, వెంకయ్యలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వెళ్లకపోతే తమను కేజ్రీ బ్లేమ్ చేస్తాడని.. వెళితే ఓడిపోయిన పార్టీగా అవమానం ఎదుర్కొంటామని వారు లోలోపల కుమిలిపోతున్నారు. ఇలా కేజ్రీ బీజేపీని ఆహ్వానించడాన్ని సహించలేకపోతున్నారు బీజేపీ నేతలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *