Breaking News

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): నగరాలు, పట్టణాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమనలకు గురికాకుండ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టర్ సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరం నడిబొడ్డున గల ఖరీదైన ప్రభుత్వం స్థలాలు ఆక్రమనలకు గురవుతున్నాయని అన్నారు. వెంటనే ప్రభుత్వ స్థలాలకు హద్దులు నిర్ణయించి ఫినిషింగ్ చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ  వసతి గృహాలకు నగరంలో స్థలం దొరకడం లేదని సప్తగిరి కాలనీలో గల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ జయచందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *