ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్

హైదరాబాద్ : వాయిదా తీర్మానాల తిరస్కరణ అంశం అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. స్పీకర్ ఏకపక్షంగా వాయిదా తీర్మానాలను తిరస్కరించడం సరికాదని.. సీఎల్పీ జానారెడ్డి మండిపడ్డారు.

ఆర్థికమంత్రి ఈటెల మాట్లాడుతూ పదేళ్లలో ఎప్పుడూ వాయిదా తీర్మానాలను చర్చించలేదని గుర్తు చేశారు. ఐపీఎస్ ల విభజన జరిగి 10 రోజులే అయ్యిందని.. తొందరలోనే నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామన్నారు.

అనంతరం జానా ఈ విషయంలో స్పందించారు. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సభలో ప్రభుత్వ నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ వాకౌట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *