
హైదరాబాద్, ప్రతినిధి : కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానల వల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కేసీఆర్ కు రైతు ఆత్మహత్యలకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ.లక్షా యాభై వేలు ఆర్ధిక సాయం ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ రైతుల ఆత్మహత్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.