Breaking News

ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: నీతూ ప్రసాద్

ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: నీతూ ప్రసాద్

కరీంనగర్: గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ భవన నిర్మాణాలు, రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శాఖల వారీగా చేపడుతున్న పనులపై సమీక్షిస్తూ, గ్రామాల్లో చేపడుతున్న పనులను వెంటనే లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయితీ భవనాలు, స్త్ర్రీ శక్తి భవనాలు, అంగన్ వాడీ భవనాలు, పనులను వెంటనే పూర్తి చేసి ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తే రాష్ట్ర్రంలోనే మొదటి స్దానంలోనే ఉండవచ్చని ఆమె అభిప్రాయ పడ్డారు. జిల్లాలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పశు సంవర్దక శాఖ ద్వారా గొర్రెలు, పశువుల యూనిట్లను పెద్ద ఎత్తున జిల్లాలో మంజూరు చేయాలన్నారు. గ్రామ పంచాయితీ, అంగన్ వాడీ, స్త్ర్రీ శక్తి భవనాలను నిర్మాణాలకు అవసరమైన భూములను ఆయా ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని, ఇంకను భూములు కేటాయించని ప్రాంతాల్లో సంబంధిత తహసీల్దార్లతో భూములు కేటాయిస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఎ. నాగేంద్ర, పంచాయితీరాజ్ ఎస్.ఇ. దశరధం, డి.పి.ఓ. సూరజ్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త శాఖ సంచాలకులు సుచరిత, గ్రామీణాభివృద్ధి అధికారి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *