ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

కరీంనగర్: చేనేత రంగానికి కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టర్ చాంబర్ లో అధికారులతో చేనేత ప్రోత్సాహకాలు, రాయితీలపై సమీక్ష నిర్శహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు రాటిఫికేషన్, 20 శాతం
నూలు రాయితీ మంజూరుకు క్రొత్త ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రాయితీకి జాతీయ చేనేత అభివృద్ధి కార్పోరేషన్, అప్కోల నుండి నేతకారుల సహకార సంఘాలు నూలు కొనుగోలు చేసినవారికి రాయితీ, ప్రోత్సాహకాలు వర్తిస్తాయని కలెక్టర్ అన్నారు. నియమ,  నిబంధనల మేరకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు పొందనున్న వారి వివరాలు సంబంధిత గ్రామ పంచాయితీల్లో ప్రదర్శించి అభ్యంతరాలు వుంటే స్వీకరించాలని, అభ్యంతరాలపై విచారణ చేసి అందరికి నిబంధనల మేరకు న్యాయం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు సంయుక్త కలెక్టర్ డా. ఏ. నాగేంద్ర, సిరిసిల్ల ఆర్డీవో బి. బిక్షా నాయక్, హైండ్లూమ్, టెక్స్ టైల్ ఎడి ఎం. వెంకటేశం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *