Breaking News

ప్రభుత్వ పరంగా ఇసుక అమ్మకం ప్రారంభం

sa-nd

కరీంనగర్, ప్రతినిధి : రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన ఇసుక పాలసీ ద్వారా లోయర్ మానేరు డ్యాం వద్ద కాజీపూర్ గ్రామంలో ప్రభుత్వం ఇసుక విక్రయాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ లోకేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నూతన ఇసుకపాలసీపై ఆయన కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ పౌసుమి బసు లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. క్యూబిక్ మీటర్ కు రూ.550/- చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు. వినియోగదారులు మీ సేవా ద్వారా ఆన్ లైన్ లో tsmdc.telangana.govt.in వెబ్ సైట్ లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. రవాణా ఖర్చులను వినియోగదారులే భరించాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో లోయేరు మానేరు డ్యాంలో 2 ప్రాంతాలలో మిడ్ మానేరు డ్యాంలోని డిషిలేటేషన్ ఇసుకను విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రీచ్ లలో 2.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించడానికి గుర్తించనట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా ఇస్తామని తెలిపారు. వినియోగదారులు 40/- ట్రెజరీలో చెల్లించి అనుమతి పొందవచ్చని తెలిపారు. ట్రాక్టర్ ద్వారా మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్థానిక వ్యక్తిగత అవసరాలకు, ప్రభుత్వ అవసరాలకు, మరుగుదొడ్ల నిర్మాణం, బలహీన వర్గాల గృహనిర్మాణాలకు ఇసుకను ఉచితంగా ఇస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *