ప్రభుత్వ పధకాలను ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలి

కరీంనగర్: రాష్ట్ర్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను జెడ్పీటిసి లు, ఎంపిపి లు ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సరిగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం కలెక్టరేటు ఆడిటోరియంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారు ప్రజా ప్రతినిధులు అధికారులు అని ఆయన అన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం తగ్గించి గ్రామ పంచాయితీలకు అప్పగించిందని ఆయన అన్నారు. గతంలోని ప్రభుత్వాలు అందరికి సమానంగా నిధులు విడుదల చేసేది కాదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం గణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజల ఏ సమస్యనైనా తక్షణమే పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటదని తెలిపారు. పాత కరీంనగర్ జిల్లాలో 38 కోట్లతో ఇండ్లపై ఉన్న ప్రమాదకరమైన వైర్లను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. బస్ స్టాండులో పరిసరాలు టాయిలెట్స్పరిశుభ్రంగా ఉంచుటకు టిప్ టాప్ గా చేయుటకు 25 కోట్లు మంజూరు చేస్తున్నామని, అందులో 10 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో 15 కోట్లతో విద్యార్ధులకు డ్యూయల్ డెస్క్ లు ఇస్తున్నామని తెలిపారు. ఎసి, ఎస్టీ లకు 85 శాతం సబ్సిడిపై బుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఎస్ ఆర్ ఎస్ పి కాలువలతో గ్రామాలలో చెరువులను నింపుతున్నామని అన్నారు. నేత కార్మికుల సంక్షేమానికి 13 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మత్స్య కార్మికుల సంక్షేమానికి 100 శాతం సబ్సిడితో అన్ని చెరువులలో చేప పిల్లలను వదిలామని అన్నారు. అందుకు 100 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములై జిల్లాను ముందుకు నడిపించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, రాజ్య సభ సభ్యులు కెప్టెన్
లక్ష్మీ కాంతారావు, ప్రభుత్వ విప్ లు సుధాకర్ రెడ్డి, ఆర్టిసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కలెక్టర్లు సర్పరాజ్ అహ్మద్, కృష్ణభాస్కర్, శరత్, కరీంనగర్, మంధని, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్.ఎల్.ఏ లు గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, సతీష్ కుమార్, ఎమ్ఎల్ సిలు నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా అధికారులు తదితరులుపాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.