ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్ధేశం

హైదరాబాద్: హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, అన్ని శాఖల ముఖ్యాధికారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.

ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ఆసరా, ఆహారభద్రత కార్డుల పంపిణీ తదితర ప్రభుత్వ పథకాలపై సీఎం అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

కాగా వేదికపై కరెంటు సరఫరా విషయంలో మాట్లాడిన కేసీఆర్ ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి కృషి ని అభినందించారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా ఇస్తున్న వారి పట్టుదల తెలంగాణకు మేలుచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఏజెండాలో 18 అంశాలపై సమావేశంలో చర్చించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *