Breaking News

ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

012

వరంగల్‌ జిల్లాకు చెందిన ఎన్‌జీవోలు, నాలుగవ తరగతి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. టిఎన్‌జీఓల సంఘం నాయకులు దేవీప్రసాద్‌, కారెం రవీందర్‌ రెడ్డి, పరిటాల సుబ్బారావు, రాజేష్, జగన్‌మోహన్‌ తదితరులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వరంగల్‌ జిల్లాకు సంబంధించి ఎన్‌జీఓలు, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వారికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించాలని సిఎం కలెక్టర్‌ కరుణకు చెప్పారు. వడ్డేపల్లి పరిధిలో గెజిటెడ్‌ ఆఫీసర్ల భవన్‌, టిఎన్‌జీవోస్‌ భవన్‌, పెన్షనర్స్‌ భవన్‌ నిర్మాణానికి వెంటనే స్థలం కేటాయించాలని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *