Breaking News

ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు

etela

రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆస్పత్రులలో ఆధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కరీంనగర్ ఆస్పత్రిలో అత్యాధునిక ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సి.టీ స్కాన్, ఎంఆర్ఐ తదితర వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *