ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలి

 

కరీంనగర్: జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వసతులు కల్పించామని ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ డాక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో క్లస్టర్ స్ధాయి అధికారులు, ఎస్.పి.హెచ్.ఓ.లతో జిల్లా స్ధాయి మార్పు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు గర్భిణి స్త్ర్రీలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల పై విశ్వాసం పెంపొందించి ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని అన్నారు. మాతా శిశు ఆరోగ్య రక్షణకు డాక్టర్లు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలకు అవసరమైన అన్ని పరికరాలు, మరిన్ని వసతులు మెరుగు పర్చాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ స్ధాయిలో గర్భిణీలను గుర్తించి ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు ఆయాల, అంగన్ వాడి వర్కర్ల పాత్ర కీలకమని అన్నారు. ఆస్పత్రులలో సాధారణ కాన్పు ముద్దు – ఆపరేషన్ వద్దు అనే నినాదంతో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. మొదటి డెలివరి తప్పకుండా ఆపరేషన్ లేకుండా జరిగేలా డాక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలోని గర్భిణీల ప్రసవాలకు ప్రభుత్వ ఆస్పత్రులే క్షేమమని ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలని సూచించారు. గ్రామాలలో గర్భిణీల ప్రసవాల సమయము తేదీలతో సహ వివరాలను సంబంధిత గ్రామ పంచాయితీ ఆయాలకు, అంగన్ వాడి వర్కర్లకు, గ్రామ పంచాయితీ కార్యదర్శులకు అందించి గర్భిణీలు ప్రసవాలకు ప్రభుత్వ ఆస్పత్రులకే వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామాలలో మార్పుపై జరుగు వివో సమావేశాలలో గ్రామ పంచాయితీ కార్యదర్శులు, క్లస్టర్ స్ధాయి మార్పు సమావేశాలలో ఇఓ.పి.ఆర్.డి.లు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు తప్పకుండా హజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో లక్ష్యం మేరకు ప్రసవాలు నిర్వహించని డాక్లర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్ వాడి కేంద్రాలకు వచ్చే గర్భిణీలకు, బాలింతలకు మాత్రమే ఆరోగ్య లక్ష్మీ పధకం క్రింద పాలు గ్రుడ్లు, అన్నం అందించాలని వారు కేంద్రాలకు రాకుంటే ఇంటికి ఇవ్వకూడదని అన్నారు. సిడిపిఓలు ఆరోగ్య లక్ష్మీ పధకం పకడ్బందిగా అమలు జరిగేలా అంగన్ వాడి కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య ఖర్చులకు భారం పడకుండా ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని వైద్య సేవలు అందిస్తున్నారని వాటిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో పారిశుద్ద్య చర్యలు ముమ్మరంగా చేయించాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రాజేశం, డిసిహెచ్ఎస్ డా.అశోక్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సూరజ్ కుమార్, పశు సంవర్ధక శాఖ జెడి డా. రామచంద్రం, డి.ఆర్.డి.ఎ. పిడి అరుణశ్రీ, డ్వామా పిడి గణేష్, స్త్ర్రీ శిశు సంక్షేమ శాఖ పిడి రాధిక, క్లస్టర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

nethu prasad...

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *