ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ సేవలందించాలి

ప్రభుత్వాసుపత్రల్లో కార్పొరేట్ సేవలందించాలి

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహా సేవలందించేలా అభివృద్ధి పరుస్తామని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్టిపిసి వారి నిర్వహిస్తున్న అంబులెన్స్ షెడ్డును, టాయిలెట్లను శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలోని స్సెషల్ కేర్ నియోనాటల్ కేంద్రాని, ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను గురించి అధికారులతో చర్చించారు. పార్లమెంటు, శాసన సభ్యుల నిధుల నుంచి ఐసియు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ప్రసవాలతో పాటు ఆరోగ్య శ్రీ సేవలను అందించాలని అన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాసుపత్రిని అన్ని హంగులతో కార్పొరేట్ ఆసుపత్రిలా అభివృద్ధి పరుస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అలీం, జిల్లా ఆసుత్రుల సమన్వయ అధికారి అశోక్ కుమార్, పెద్దపల్లి, ఆర్డీవోనారాయణ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్య శ్రీ రావు, రామగుండం మేయర్ కె లక్ష్మీ నారాయణ, జడ్పిటిసి సంధ్యారాణి, కార్పొరేటర్ ఉమాదేవి, వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *