ప్రబలుతున్న రోగాలు

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): జిల్లాలో అంటువ్యాధులు ప్రభలుతున్నాయి. అంటువ్యాధులతో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. నిన్నమొన్నటి వరకు పదుల సంఖ్యల ఉన్న రోగుల చేరికలు నేడు వందల సంఖ్యకు దగ్గరవుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆసగా తీసుకున్న కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్లే అంటువ్యాధులు ప్రభలుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. వాతావరణ మార్పులకు తోడు వివిధ రకాల వైరస్ లు ఎప్పటికప్పుడు పుట్టుకస్తుండటంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి కూడా రోజురోజుకు తగ్గిపోవడం కూడా ఈ రోగాలకు తావిస్తున్నాయి.  ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *