Breaking News

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్

IMG_1156

 జినోమ్ వ్యాలీలో పర్యటించిన మంత్రి కేటీఆర్

 MN పార్క్, ఐ హబ్ పార్క్ ప్రారంభం

 కంపెనీలకు 20 లక్షల చదరపు అడుగుల వసతులు కల్పించే ఐ హబ్ 2 ప్రాజెక్టుకు శంఖుస్థాపన

 50 కోట్ల రూపాయల ఐసిఐసిఐ SME హబ్ ప్రారంభం

 300 కోట్ల బయోలాజికల్ ఈ-సెజ్ క్యాంపస్ కు శంఖుస్థాపన

 102 ఎకరాల్లో నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు శంఖుస్థాపన

 3 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం

 వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయల కల్పన నిధి ఏర్పాటు

ప్రపంచ లైఫ్ సైన్సెస్ , ఫార్మా రాజధానిగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికి మొదటినుంచి హైదరాబాద్ కేంద్రంగా ఉందన్న కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మా సిటీ, ఈ రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ రోజు శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీలో పర్యటించిన మంత్రి, పలు కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 200 ఫార్మా కంపెనీలు, పదివేల మంది ఉద్యోగులతో ఆసియాలోనే అతిపెద్ద క్లస్టర్ గా నిలిచిన జినోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధనలకు కేంద్రగా ఉందన్నారు. ఔషధ పరిశోధనలు, ఆవిష్కరణలు,తయారీకి కావాల్సిన సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయన్నారు. ఫలితంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. నోవాటీస్, జిఎస్కే,లోన్జా వంటి దిగ్జజ కంపెనీలు తమ కార్యకలాపాలను జీనోమ్ వ్యాలీలో విస్తరిస్తున్నాయన్న మంత్రి, ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ ఐ ల్యాబ్ ను ప్రారంభించాలని ఆ సంస్థ ఛైర్మెన్ ఫాల్స్ టోఫెల్ కు విజ్ఞప్తి చేశారు. టోఫెల్ తో కలిసి పలు కంపెనీలకు శుంఖుస్థాపన చేశారు. సుమారు 17 వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాక్సిన్ల తయారీ, పరిశోధనకు సంబంధించిన బయెలాజికల్ ఈ –సెజ్, 50 వేల చదరపు అడుగుల ఐసిఐసిఐ SME నాలెడ్జ్ పార్క్ , MNపార్క్ రెండవ దశ, పరిశోధనలకు అనువైన 20లక్షల చదరపు అడుగుల రెడీ టూ అక్యుపై, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోనే మొదటిదైన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సరికొత్త సదుపాయల కల్పనతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ మరింత ముందుకు పోతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. వ్యాలీలో ఉన్న కంపెనీలు స్థానిక ఉద్యోగ కల్పన, అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, అందులో భాగంగానే మెడికల్ సెంటర్ ను కూడా ఈ రోజు ప్రారంభించామని చెప్పారు. 672 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 6 కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందచేయడంతో పాటు ఫార్మా బయోటెక్ పరిశ్రమలో మౌలిక వసుతుల కల్పనకు వెయ్యి కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటుచేసేందుకు సెరెస్ట్రా కంపెనీతో MOU కుదుర్చుకున్నామని తెలిపారు. మొత్తంగా మూడు వేల కోట్ల రూపాయల ఈ పెట్టుబడులతో జినోమ్ వ్యాలీ 2.0 కొత్త రూపం సంతరించుకుని మరింత ముందుకు పోతుందన్న విశ్వాసం తనకుందన్నారు. స్వయంగా బయాలజీ స్టూడెంట్ అయిన తాను ఈ రంగంలో శిక్షణ, ఉపాధి కల్పన పెంచేందుకు ప్రయత్నం చేస్తానని హామి ఇచ్చారు. జినోమ్ వ్యాలీని త్వరలోనే ప్రత్యేక పారిశ్రామిక ఐలా [IALA] గా ప్రకటించి, మౌలిక వసతుల కల్పనను మరింత సులభతరం చేస్తామన్నారు. ప్రపంచంలో సాఫ్ట్ వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీ ఎట్లనో అట్లనే లైఫ్ సైన్సెస్ లో జినోమ్ వ్యాలీ పేరును నిలబెడతామన్నారు. ఫార్మా రంగాభివృద్దికి ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి కొత్త ప్రాజెక్టులను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. కె. తారకరామారావు లాంటి ముందుచూపు, ఉత్సాహం ఉన్న నాయకుడు ఉంటే ఫార్మా రంగంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ ఛైర్మెన్ ఫాల్స్ టోఫెల్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న సౌకర్యాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయన్న టోఫెల్, కంపెనీల ఏర్పాటుకు ఇది అనువైన ప్రదేశమని ప్రశంసించారు.అంతకుముందు ఫాల్స్ టోఫెల్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్,హైదరాబాద్-ఫార్మా రంగం వివరాలు,పురోగతిపై చర్చలు జరిపారు
872f589a-8ea7-44bb-a8d2-d813bba59597

748408f9-5d27-4aa5-9d1b-0a24f70849f7

edfa9f4e-8c53-4fc7-82e9-8166d40d552a

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *