
గుజరాత్ : ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి చారిత్రకంగా అత్యంత ప్రాధాన్య ఉంది. ఈ సందర్భానికి గుర్తుకు ఈ తేదీని ఎంచుకున్నారు. గాంధీనగర్ లో బుధవారం భారతీయ దివస్ సమావేశాలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడు రోజలు పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా గురువారం మోడీ ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో భారతీయులున్నారని, విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఐక్యత చాటారన్నారు. భారత్ లో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయని, ప్రవాస భారతీయులను చూస్తే గర్వంగా ఉందన్నారు. మారిషస్ లో గాంధీ జయంతి ఘనంగా నిర్వహిస్తారన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ సత్తా ఏంటో చూపించాలని, దేశాభివృద్ధికి మీరందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భారత అభివృద్ధిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేసేందుకు మోడీ ఈ సదస్సును వేదిక చేసుకోనున్నారు.