Breaking News

ప్రపంచ కప్ ముందు గుణపాఠమే..

india team

ముంబై , ప్రతినిధి : ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినా ఇండియా క్రికెట్ టీం ఉత్త చేతులతో తిరిగివస్తోంది. మూడు నెలలుగా టెస్టులు, వన్డేలు ఆడినా ఒక్కటంటే ఒక్క గెలుపు కూడా సాధ్యం కాలేదు. ధోని, విరాఠ్, రైనా, లాంటి మేటి క్రీడాకారులు ఉన్నా గెలుపు మొహం వాచిపోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

మరో 10 రోజుల్లో వరల్డ్ కప్ రాబోతోంది. ఓడిపోయిన అదే గడ్డ ఇండియా ప్రపంచకప్ లో ఆడబోతోంది. మరి విజయం దరిచేరని ఇదే టీం ప్రపంచకప్ ను మళ్లీ దక్కించుకుంటుందా ? అంటే సందేహమే.. గత వరల్డ్ కప్ గెలిచిన సభ్యుల్లో ఒక్క ధోని, రైనా తప్ప ఎవరికీ చోటు లేదు. దీంతో ఎవరి లేని ఇండియా జట్టు పై అంచనాలు లేకుండా పోయాయి. దీంతో వచ్చే ప్రపంచకప్ లో మన ఇండియా టీమ్ గెలుపు అంతా సులభంకాదు.

ఈ ముక్కోణపు సీరిస్ లోనే మనవాళ్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో భారీ ఓటములు పొందారు. దీంతో వచ్చే ప్రపంచకప్ లో మనవాళ్ల పర్ఫ్మామెన్స్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలో ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *