
ఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సరికొత్త ప్రోమోలో దర్శనమిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్ కప్ పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ టెండుల్కర్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. ఈ ప్రోమోలో మాస్టర్ సచిన్ క్రికెట్‌ఆటతో పాటు, వరల్డ్ కప్ పోటీలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 2015 ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వేదికగా వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.