
ప్రపంచాన్ని కదిలించిన సిరియా బాలుడి అంత్యక్రియలు ముగిశాయి.. సిరియా నుంచి ఐఎస్ఐఎస్ దాడుల నేపథ్యంతో గ్రీస్ కు వలస వెళ్లిన ఓ సిరియా కుటుంబం సముద్రంలో మునిగిపోయింది.. భర్త ప్రాణాలతో బయటపడగా.. భార్య , ఇద్దరు పిల్లలు చనిపోయారు. 3 ఏళ్ల కుర్తి పిల్లాడి శవం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. ఈ బాలుడి దీన మృతి ప్రపంచాన్నే కదిలించింది..
కాగా టర్కీ మానవతా హృదయంతో స్పందించింది. ఆ పిల్లాడి శవాన్ని, భార్య మరో పిల్లాడి శవాన్ని సిరియాలోని కొబాటకు తరలించింది. ఆ తండ్రికి అప్పగించింది..కుటుంబాన్ని కోల్పోయిన ఆ తండ్రి గుండె బాధతో విలవిల్లాడింది.. సిరియా ఉగ్రవాదుల నుంచి శరణార్థులను కాపాడాలని వేడుకున్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని కోరాడు..