మార్చి 20న తుంగభద్ర విడుదల

01-01

‘ఈగ’ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రెడిట్ సంపాదించి ‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ అధినేత సాయికొర్రపాటి. గతేడాది నటసింహ నందమూరి బాలకృష్ణ‘లెజెండ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఆఫ్ టాలీవుడ్ తర్వాత ‘ఉహలు గుసగసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. అంతే కాకుండా ఒక వైపు భారీ చిత్రాలు, మరోవైపు మినిమమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచారు. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్, డింపుల్ హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి  చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా మార్చి 20న విడుదల చేస్తున్నారు.

02-02

ఈ సందర్భంగా…వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి మాట్లాడుతూ ‘’గతేడాది బాలకృష్ణగారితో ‘లెజెండ్’ సినిమా చేశాను అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత మా బ్యానర్ లో వచ్చిన ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అలాగే ఈ ఏడాది మా వారాహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘తుంగభద్ర’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. హరి గౌర సంగీతానికి మంచి అప్లాజ్ వచ్చింది.  అలాగే థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాస కృష్ణగోగినేని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సినిమాను బ్యూటిఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కించారు. ప్రతి సీన్ ఒక ఫీల్ ను కలిగించేలా ఉంటుంది. ఆదిత్, డింపుల్, సత్యరాజ్, కోటశ్రీనివాస రావు, చలపతి రావు తమ పాత్రలకు గొప్పగా న్యాయం చేశారు. హరిగౌర సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది.  సెన్సార్ సహా సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

0001

ఆదిత్, డింపుల్ చోపడే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, సప్తగిరి,కోటశంకరరావు, పవిత్రా లోకేష్, రాజేశ్వరి నాయర్, ధనరాజ్, నవీన్ నేని, రవివర్మ, జబర్ దస్త్ శ్రీను, చరణ్, శశాంక్,కల్పలత, శ్రీనివాస్ ఇతర తారాగణం.  ఈ చిత్రానికి  సాహిత్యం: సాహితి, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, రాధా సుబ్రహ్మణ్యం, గణేష్ సలాది, పైట్స్: నందు, డ్రాగన్ ప్రకాష్, సాల్మన్ రాజ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ఆర్ట్: హరివర్మ, కొరియోగ్రఫీ: శంకర్, ఎడిటింగ్: తమ్మిరాజు, సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్,కో ప్రొడక్షన్: సిల్లి మాంక్స్, నిర్మాత: రజని కొర్రపాటి, రచన-దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *