
అనుకున్నట్టే అయ్యింది. ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచకప్ ను ఐదోసారి ఎగురేసుకుపోయింది. ఆదివారం మెల్ బోర్న్ లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. లీగ్ దశలో ఓడించిన న్యూజిలాండ్ ను తుక్కు తుక్కుగా ఓడించి సగర్వంగా ప్రపంచకప్ విజేత గా ఆవిర్భవించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 45 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 33.1 ఓవర్లలో 186/3 చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫాల్కనర్ (ఆస్ట్రేలియా), మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ( స్టార్క్ )లకు దక్కాయి.