Breaking News

ప్రపంచకప్ టీ ట్వంటీ విజేత వెస్టిండీస్

West-Indies-T20-World-Cup-Squad

-ఫైనల్లో పోరాడి ఓడిన ఇంగ్లాండ్..

ఇండియా వేదికగా జరిగిన ప్రపంచకప్ టీట్వంటీ పోటీల్లో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది.. ఆద్యంతం ఉత్కంఠ బరితంగా సాగిన ఫైనల్ పోరులో వెస్టిండీస్ జట్టు అసమాన పోరాట పటిమ సాగించింది. ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో గట్టిగా పోరాడింది. ఒక దశలో ఇంగ్లాండ్ గెలుస్తుందని ఊహించారు. కానీ వెస్టిండీస్ విజయానికి, ఇంగ్లాండ్ అపజయానికి మధ్య ఉన్నది ఆ ఒక్క చివరి ఓవరే..

చివరి ఓవర్ లో వెస్టిండీస్ విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన సమయంలో ఓవర్ బాగా వేస్తే ఇంగ్లాండ్ గెలిచేదే కానీ బంతినందుకున్న స్టోక్స్ కు చుక్కలు చూపించాడు వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ బర్త్ వైట్.. వరుసగా 4 బంతుల్లో 4 సిక్స్ లు బాది వెస్టిండీస్ కు ఒంటిచేత్తో విజాయాన్ని అందించాడు బర్త్ వైట్. కానీ అంతకుముందు వెస్టిండీస్ మొదట్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడితే మార్లోన్ శ్యాముల్స్ 66బంతుల్లో 85 పరుగులు చేసి విజయానికి కారణమయ్యాడు..

తొలుత ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 155/9 పరుగులు చేసింది. జోయ్ రూట్ 36 బంతుల్లో 54 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్19.4ఓవర్లలో 161/4 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్యామూల్స్ 85 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

కాగా భారత్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా ఎంపికైనా అందుబాటులో లేకపోవడంతో విరాట్ కు బదులు సౌరవ్ గంగూలీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కోహ్లీ తరఫున అందుకున్నాడు..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *