ప్రపంచంలో మొట్టమొదటి పురుషాంగం మార్పిడి

సౌత్ ఆఫ్రికాలోని ముస్లిం కుటుంబాల్లో సున్తీ చేయించుకోవడం ఆనవాయితీ. అక్కడ ప్రతీ ఏటా చాలా మంది ముస్లిం యువకులు సున్తీ చేయించుకుంటారు. ఈ సమయంలో అజాగ్రత్త వల్ల ఇన్ ఫెక్షన్ సోకి ఆనారోగ్యాల పాలవుతుంటారు. ఇటీవల అలానే జరిగింది. సౌతాఫ్రికాలో ఓ యువకుడు అజాగ్రత్తగా సున్తీ చేయించుకోవడంతో ఇన్ ఫెక్షన్ సోకి అతడి పురుషాంగాన్ని తీసేయాల్సివచ్చింది. మూడేళ్లుగా పురుషాంగం లేకుండా జీవిస్తున్నాడు.

అయితే ఇటీవల మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానానికి ముందుకు రావడంతో అతడి పురుషాంగాన్ని ఈ యువకుడికి పెట్టేందుకు నిర్ణయించారు. స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ వైద్యులు దాదాపు 7 గంటలపాటు శ్రమించి మొట్టమొదటి సారిగా పురుషాంగం ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి విజయం సాధించారు. ప్రపంచంలోని అంగాన్ని ట్రాన్స్ ప్లాంట్ చేయడం మొదటిసారిది. దీంతో ఆ 21 ఏళ్ల యువకుడికి మళ్లీ అంగాన్ని ప్రసాదించినవారయ్యారు ఆ డాక్టర్లు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *